ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు
26-06-2024 01:43 AM
రంగారెడ్డి కలెక్టర్ శశాంక
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని రంగారెడ్డి కలెక్టర్ శశాంక హెచ్చరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లోని భూములను కొందరు ఆక్రమిస్తున్నారని తెలుసుకున్న కలెక్టర్ మంగళవారం ఆయా భూములను పరిశీలించారు. కబ్జా వ్యవహారంలో సూత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. త్వరలోనే భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పర్యటనలో శేరిలింగంపల్లి రెవెన్యూశాఖ అధికా రులు ఉన్నారు.






