04-07-2025 10:23:06 AM
వొడితల ప్రణవ్
హుజురాబాద్, (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఆలస్యం చేయడం నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ప్రణయ్ బాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు మాట్లాడుతూ... ఎమ్మెల్యేకు ప్రభుత్వంపై కోపం ఉంటే ప్రజలపై చూపించడం తగదని, నెలలుగా చెక్కులు రివాలిడేషన్ పేరుతో తిరిగి పంపించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ హయాంలో విడుదలైన చెక్కులను సీఎం ఫొటో తీసేసి పంపిణీ చేయడాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.చెక్కులు పంచడానికి కూడా సమయం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు, ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికే కాదు, ప్రజల సంక్షేమాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.