7 May, 2026 | 2:38 AM

నామినేటెడ్ పదవుల జాతర

07-05-2026 02:07 AM

17 కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ పదవుల భర్తీ

ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు జాతర మళ్లీ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావాహుల్లో కొందరికి ఊరట లభించింది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీచేసిన ప్రభుత్వం, మరి కొందరికి పదవులను కట్టబెట్టింది.

ఈ జాబితాను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో బుధవారం ప్రకటించా రు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మ న్లు, 11 వైస్ చైర్మన్ పదవులకు పేర్లను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీచేశారు. త్వరలోనే మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీచేస్తామని మహేశ్ కుమార్‌గౌడ్ ప్రకటించారు.