03-12-2025 12:32:39 AM
-ప్రజాసేవ కోసమే నిర్ణయం
-కామారెడ్డి జిల్లా ఎండ్రియాల సర్పంచ్ అభ్యర్థి గంగయ్య
కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): సర్పంచ్‌గా పోటీ చేసి ప్రజాసేవ చేయాలని భావించిన ఓ మేకల యజమాని తనకున్న వాటిలో పదింటిని అమ్మి, ఆ డబ్బుతో సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎండ్రియాల గ్రామానికి చెందిన మేకల కాపరి గంగయ్య సర్పంచ్‌గా పోటీ చేసి ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
అందుకోసమే తనకున్న మేకలలో 10 మేకలను అమ్మకానికి పెట్టాడు. మేకలను అమ్మగా రూ.50 వేలు వచ్చాయి. తన అనుచరులతో కలిసి మంగళవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనతో పాటు వార్డు సభ్యులను బలపరచడానికి ఆఫిడవిట్లకు కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు. నామినేషన్ల కోసం డబ్బులు చెల్లించారు. సర్పంచ్ ఎన్నికల్లో గంగయ్య సంకల్పం నెరవేరుతుందా లేదా ఎన్నికల తర్వాత తెలియనుంది.