23 August, 2026 | 6:04 AM

నటుడు పృథ్వీరాజ్‌కు భారీ షాక్... అరెస్ట్ వారెంట్‌ జారీ

13-06-2024 01:55 PM

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పాత్రతో సుపరిచితుడైన టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌కు భారీ షాక్ తగిలింది. విజయవాడలోని స్థానిక ఫ్యామిలీ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లింపుపై ఆయన భార్య బాలిరెడ్డి శ్రీలక్ష్మి అతనిపై కోర్టులో దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. గతంలో పృథ్వీరాజ్ భార్య బాలిరెడ్డి శ్రీలక్ష్మికి ఫ్యామిలీ కోర్టు రూ. నెలకు 8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పృథ్వీరాజ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును సమీక్షించిన హైకోర్టు తాత్కాలిక ఉపశమనం పొందిన పృథ్వీరాజ్‌ నెలకు రూ. 22,000 చెల్లించాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడంతో ఆయన భార్య శ్రీలక్ష్మి, ఆమె న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, సప్ప రమేష్, సీహెచ్ వడ్డికాసులు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాలేదని, కేసు వివరాలకు సంబంధించి ఓ వార్తాపత్రికలో పబ్లిక్ నోటీసు మాత్రమే జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి పిటిషన్‌ను పరిశీలించి నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్‌ సమస్యల్లో పడనున్నట్లు తెలుస్తోంది.