23-10-2025 11:40:14 AM
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
చేవెళ్ల: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ(Hyderabad - Bijapur National Highway) రహదారిపై రోడ్డు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం తెల్లవారు చేవెళ్ల మున్సిపల్(Chevella Municipal) పరిధిలోని మల్కాపూర్ స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్(25) వడ్ల రవి(26) హైదరాబాద్ లో ఒకరు డ్రైవర్ గా, మరొకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.
బుధవారం రాత్రి పరిగిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి దాటాక స్కూటీపై హైదరాబాద్ కు బయలుదేరారు. మార్గమధ్యలో చేవెళ్ల మున్సిపాలిటీలోని మల్కాపూర్ స్టేజీ(Malkapur Stage) వద్దకు రాగానే స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో సల్మాన్, వడ్ల రవి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ భూపాల్ తెలిపారు.