23-10-2025 11:37:00 AM
తుంగతుర్తి ఏఈ సురేందర్
తుంగతుర్తి,(విజయక్రాంతి): విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ సురేందర్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని పలు వార్డుల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించి మాట్లాడారు. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు బస్తీబాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్లు రాజ్ కుమార్, జిలాని, హెల్పర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.