25-09-2025 10:38:08 AM
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రను ప్రజలకు పరిచయం చేసిన ప్రముఖ తెలంగాణ సామాజిక రాజకీయ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్(Kompally Venkat Goud passed away) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ ఆస్పత్రిలో తదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కొంపల్లి గౌడ్ వొడువని ముచ్చట, నీళ్ల ముచ్చట పుస్తకాలు రాశారు. సర్వాయి పాపన్న చరిత్రను కూడా కొంపల్లి వెంకట్ గౌడ్ రాశారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.