25-09-2025 10:00:34 AM
14 ఏళ్ల తర్వాత నెరవేరిన కల
తెలంగాణలో గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.
బుధవారం అర్ధరాత్రి తర్వాత ఫలితాలు విడుదల
మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులు ఎంపిక.
గ్రూప్-1 ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంక్.
హైదరాబాద్: గ్రూప్-1 తుది ఫలితాలు(Telangana PSC Group-I results) విడుదలయ్యాయి. 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్‌సీ ప్రకటించింది. కోర్టు వివాదం నేపథ్యంలో ఒక పోస్టు ఫలితాలన్ని విత్ హెల్డ్ లో పెట్టింది. గ్రూప్-1 తుది ఫలితాల్లో లక్ష్మీ దీపిక(హైదరాబాద్)కు తొలి ర్యాంక్, దాడి వెంకటరమణకు రెండో ర్యాంక్, వంశీకృష్ణారెడ్డికి 3వ ర్యాంక్, జిన్నా తేజస్వినికి 4వ ర్యాంక్, సిదాల కృతిక 5వ ర్యాంక్, హర్షవర్ధన్ కు 6వ ర్యాంక్, కె. అనూషకు 7వ ర్యాంక్, ఏరెండ్ల నిఖితకు 8 వ ర్యాంక్, కె, భవ్యకు 9వ ర్యాక్, శ్రీకృష్ణసాయికి 10 వ ర్యాంక్ వచ్చింది. మల్టీ జోన్-1 258, మల్టీజోన్-2లో 304 మంది అధ్యర్థులు ఎంపికయ్యారు. టాప్ 10 ర్యాంకర్లు ఆర్డీవో పోస్టులకు ఆప్షన్ ఇచ్చారు.