25-09-2025 11:27:58 AM
ముగ్గురు యువకులపై పోక్సో కేసు..
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్(Alwal Police Station) పరిధిలో ముగ్గురు యువకులపై పోక్సో(Protection of Children from Sexual Offences) కేసు నమోదైంది. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. దైవదర్శనం కోసమంటూ ముగ్గురు బాలికలను ఈ నెల 20 యువకులు యాదగిరిగుట్టకు(Yadagirigutta) తీసుకెళ్లారు. దర్శనం అనంతరం బాలికలను యువకులు లాడ్జీకి తీసుకెళ్లారు. బాలికలను మరుసటిరోజు హైదరాబాద్ లో వదిలి యువకులు పరారయ్యారు. బాలికలు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాలికల తల్లిదండ్రులు ముగ్గురు యువకులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు, లాడ్జి ఓనర్ ను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.