ఇంటిపేరులో మార్పుతో.. సీఈఓ సుదర్శన్‌రెడ్డికి సర్ నోటీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(special intensive revision of the electoral roll) (సర్) ప్రక్రియలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓటర్ల డేటాలో వ్యత్యాసాలు ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 93 లక్షల మందికి అధికారులు నోటీసులు జారీ(notices issued) చేస్తుండగా ఆ జాబితాలో స్వయం గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సీ సుదర్శన్ రెడ్డి(C Sudarshan Reddy) ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పేర్ల నమోదులో ఉన్న వ్యత్యాసాల ఆధారంగా అధికారులు ఈ నోటీసును పంపారు. 2002 నాటి ఓటర్ల డేటాతో పోలిస్తే 2026 నాటి వివరాల్లో ఆయన ఇంటిపేరు సరిపోకపోవడమే అందుకు కారణం అని తెలుస్తోంది. గతంలో ఇంటిపేరు స్థానంలో సంక్షిప్త అక్షరం ఉండగా, ప్రస్తుత రికార్డుల్లో పూర్తి ఇంటిపేరు నమోదై ఉం ది.
దీంతో విచారణ ప్రక్రియలో భాగం గా అధికారులు సీఈఓకే నోటీసు అందజేశారు. నోటీసు అందుకున్న అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి గుర్తింపు కార్డుగా తన పాస్‌ఫోర్ట్ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు సమర్పించి వివరణ ఇచ్చారు.






