2 July, 2026 | 4:57 PM

Breaking News

ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •  

పొలిగలదో

30-05-2024 01:38 AM

జొకోవిచ్ శుభారంభం 

అల్కరాజ్, జాబుర్ ముందంజ

మట్టికోటలో సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ బోణీ కొట్టాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్.. స్థాయికి తగ్గ ఆటతో రోలాన్డ్ గారోస్‌లో తొలి గెలుపు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి మార్గరేట్ కోర్ట్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న జొకోవిచ్.. సిల్వర్ జూబ్లీ జర్నీ షురూ చేశాడు. సమకాలికుల్లో రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకగా.. నాదల్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడంతో జొకోకు ఈ టోర్నీలో పోటీనిచ్చేదెవరో మున్ముందు తేలనుంది. ఇక స్పెయిన్ నయా బుల్ కార్లోస్ అల్కరాజ్ మూడో రౌండ్‌లో అడుగుపెట్టగా.. మహిళల సింగిల్స్‌లో జాబుర్ ముందంజ వేసింది. 

పారిస్: ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో అత్యధిక (24) గ్రాండ్‌స్లామ్స్ సాధించి రికార్డు సృష్టించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. నిరుడు మట్టికోట కిరీటం దక్కించుకున్న జొకోవిచ్.. ఈ సారి కూడా విజేతగా నిలవాలనే దృఢ సంకల్పంతో టోర్నీలో అడుగుపెట్టినట్లు తన ఆటతో స్పష్టం చేశాడు. పురుషుల సింగిల్స తొలి రౌండ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6 7 (7/3), 6 హెబెర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. అంచనాలు లేకుండానే బరిలోకి దిగానని చెప్పిన జొకోవిచ్.. వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో జొకోవిచ్ 4 ఏస్‌లే కొట్టగా.. హెబెర్ట్ 7 ఏస్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే జొకో రెండు డబుల్ ఫాల్ట్స్ మాత్రమే చేయగా.. 7 డబుల్ ఫాల్ట్స్ చేసిన హెబెర్ట్ పరాజయం వైపు నిలిచాడు. గ్రాండ్‌స్లామ్ ఆరంభానికి ముందు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన జొకోవిచ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం సాధికారికంగా ఆడాడు.

7 బ్రేక్ పాయింట్లు సాధించిన జొకో.. 29 విన్నర్లు సంధించగా.. 37 విన్నర్లు కొట్టిన హెబెర్ట్ 31అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్‌లో సునాయాసంగా నెగ్గిన జొకో.. రెండో సెట్‌ను టై బ్రేకర్‌లో దక్కించుకోగా.. మూడో సెట్‌లో అనుభవాన్ని రంగరించిన జొకో డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని తికమకపెట్టి లాభం పొందాడు. ‘మంచి ఆరంభం లభించింది. దీనికన్నా మెరుగైన ప్రదర్శన చేయగలను. కానీ హెబెర్ట్ సర్వీస్ బలంగా ఉంది. గ్రాండ్‌స్లామ్స్ ఆడటాన్ని ఆస్వాదిస్తా. అవి నాలో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతాయి’ అని ఇప్పటి వరకు మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన జొకోవిచ్ అన్నాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 63వ ర్యాంకర్ కర్బెల్స్ బియానా (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడనున్నాడు.

అల్కరాజ్ అలవోకగా.. 

మట్టికోట మహరాజు రాఫెల్ నాదల్ బాటలోనే నడుస్తున్న అదే దేశానికి చెందిన యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో  మూడో సీడ్ అల్కరాజ్ 6 6 2 6 డి జాంగ్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. 3 గంటల 9 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 35 విన్నర్లు, రెండు ఏస్‌లు బాదగా. 26 విన్నర్లకే పరిమితమైన డి జాంగ్ ఏడు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ 176వ ర్యాంక్‌లో ఉన్న డి జాంగ్.. అల్కరాజ్ చేతిలో ఓడినా.. తన పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీక్) 6 6 6 (2/7), 6 డానియల్ అట్‌మైర్ (జర్మనీ)పై గెలిచి మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఆరో సీడ్ రూబ్లెవ 6 6 6 మార్టినేజ్‌ను మట్టికరిపించగా.. బబ్లిక్ కూడా ముందంజ వేశాడు.