సబలెంకా సాఫీగా..
పారిస్: సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంకా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ గురువారం రెండో రౌండ్‌లో 6 6 క్వాలిఫయర్ ఉగ్జిమా (జపాన్)పై గెలుపొందింది. 62 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో సబలెంకా 27 విన్నర్లు కొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ రైబాకినా(కజకిస్థాన్) 6 6 అరాంటా రుస్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. స్వితోలినా (ఉక్రెయిన్) 6 7 (7/3)తో డెయిన్ పారీ (ఫ్రాన్స్)పై గెలుపును అందుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), మూడో సీడ్ కొకో గాఫ్, ఐదో సీడ్ వోండ్రుసోవా మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు.
మూడో రౌండ్‌కు జొకోవిచ్
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ఎదురులేకుండా పోయింది. రెండో రౌండ్‌లో ఈ సెర్బియా వీరుడు 6 కార్‌బెల్లాస్ బెనా (స్పెయిన్)పై సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. 2 గంటల పాటు జరిగిన పోరులో జొకోవిచ్ ఎక్కడా తన ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. మ్యాచ్‌లో 5 ఏస్‌లు సంధించిన జోకో 12 బ్రేక్ పాయింట్లు, 43 విన్నర్స్ సంధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 7 (7/4), 6 6 గాఫిన్‌పై, ఆరో సీడ్ ఆండీ రుబ్లేవ్ (రష్యా) 6 6 6 మార్టినేజ్‌పై, సిట్సిపాస్ (గ్రీస్) 6 6 6 (2/7), 6 ఆల్ట్‌మెయిర్ (జర్మనీ)పై విజయా లు సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. నేడు జరగనున్న పురుషుల డబుల్స్‌లో భార త సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న బరిలో దిగనున్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అంచనాలకు అనుగుణంగా సాగుతోంది. టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లంతా సునాయాస విజయాలతో సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో సబలెంకా, స్వితోలినా, రైబాకినా ముందంజ వేయగా.. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ జొకో, రెండో సీడ్ సిన్నర్, మెద్వెదెవ్, జ్వెరెవ్‌లు మూడో రౌండ్‌కు చేరుకున్నారు.






