జాబుర్ జోరు
మహిళల సింగిల్స్‌లో ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఒన్స్ జాబుర్ ముందంజ వేసింది. బుధవారం జరిగిన రెండో రౌఔండ్‌లో జాబుర్ 6 1 6 ఒసోరీ సెర్రానో (కొలంబియా)పై గెలుపొందింది. తొలి రౌండ్‌లో సునాయాస విజయం సాధించిన ఎనిమిదో సీడ్ జాబుర్‌కు గంటా 45 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. కీలక సమయాల్లో పాయింట్లు దక్కించుకున్న ట్యునీషియా ప్లేయర్ విజయం సాధించింది. మ్యాచ్‌లో 31 విన్నర్లు కొట్టిన జాబుర్.. 33 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో సోఫియా కెనిన్ (అమెరికా) 6 6 గార్సియా (ఫ్రాన్స్)పై గెలుపొందింది. గంటన్నర పాటు సాగిన పోరులో 26 విన్నర్లు కొట్టిన కెనిన్.. 13 అనవసర తప్పిదాలు చేయగా.. 7 ఏస్‌లతో దుమ్మురేపిన గార్సియా.. 4 డబుల్ ఫాల్ట్స్ చేసి పరాజయం కొనితెచ్చుకుంది.






