ఎమ్మెల్యేను పరామర్శించిన ఎన్నారై కాస రాకేష్ యాదవ్
నూతనకల్ మార్చి 22 : ఇటీవల ఎమ్మెల్యే మందుల సామెల్ నివాసంపై జరిగిన దాడిని నిరసిస్తూ, ఆయనకు సంఘీభావం తెలపడానికి మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన ఎన్నారై(NRI )కాస రాకేష్ యాదవ్ తో పాటు గ్రామానికి చెందిన దళిత నాయకులు ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న నాయకులు, ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో డాక్టర్ కొమ్ము నగేష్,కొమ్ము పరమేష్, మహంకాళి శ్రవణ్ కుమార్, నాయిని సోమయ్య,నాయకపు మల్లేష్,కొమ్ము రవీందర్, ఇరుగు మల్లేష్, నాయకపు వెంకన్న, నాయకపు మహేష్,కొమ్ము వెంకటేష్, కొమ్ము సురేష్, ఇరుగు నవీన్ తదితరులు పాల్గొన్నారు.




