హనుమంత వాహనంపై నృసింహుడు
యాదాద్రి భువనగిరి, మే 21 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి మంగళవారం సాయంత్రం శ్రీరాముడి అలంకరణలో హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనృసింహుడి సన్నిధిలో నిర్వహిస్తున్న స్వామివారి జయంత్యుత్సవాల్లో రెండో రోజు ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. ఉదయం కాళీయ మర్ధను డిగా లక్ష్మీనృసింహులు భక్తజనులకు తిరువీధిలో దర్శనమిచ్చారు. పట్టువస్త్రాలు, దివ్యాభరణాలతో అలంకృతులైన స్వామివారిని ఆలయ మాఢ వీధుల్లో భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఊరేగించారు. భక్తులకు ఆహ్లాదం కోసం ఆలయ తిరువీధుల్లో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ను ప్రారంభించారు. ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు ధార్మిక కార్యక్రమాలను భక్తులు వీక్షించడానికి అనువుగా వీటిని ఏర్పాటుచేశారు.






