24 August, 2026 | 6:00 AM

దోస్త్‌కు 56,223 రిజిస్ట్రేషన్లు

22-05-2024 01:14 AM

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): దోస్త్‌కు ఇప్పటివరకు 56,223 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. వెబ్ ఆప్షన్లు 19,826 మంది అభ్యర్థులు పెట్టుకున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది కం టే ఈసారి దోస్త్‌కు రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నట్లు తెలిపారు. మొదటి విడుత సీట్లను జూన్ 3న కేటాయించనున్న విషయం తెలిసిందే.