calender_icon.png 14 July, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులపై ఎన్‌ఆర్ రాసిన పాట స్ఫూర్తిదాయకం

14-07-2025 01:47:38 AM

-పాట ఆవిష్కరణ సభలో పలువురు వక్తలు

ముషీరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఉపాధ్యాయులపై ఎన్‌ఆర్ రాసిన పాట స్పూర్తిదాయకం అని పలువురు వక్తలు కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఉన్న గౌరవం ఈ పాట ద్వారా మరోసారి చాటి చెప్పిందని వారు కోనియాడారు. ఆదివారం రాత్రి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మార్పు కళామండలి వ్యవస్థాపకులు విశ్రాంత ఉపాధ్యాయుడు ఎన్‌ఆర్ రాసిన ’జ్ఞానజ్యోతి వెలిగించి ఓ ఉపాధ్యాయుడా నీకు ఎవరు సాటి’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, అరుణోదయ విమలక్క, ప్రముఖ రచయిత్రి జూపాక శ్రీభధ్ర, రచయిత నాళేశ్వరం శంకరం, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యాక్షుడు పి.హను మండ్లు, బందు సొసైటీ అధ్యకుడు పి.వీరస్వామి, యాదగిరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్‌ఆర్ కే దక్కిందన్నారు.

పాట ఉద్యమ స్వభావం శాశ్వతంగా ఉంటాయని ఎన్‌ఆర్ నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి జీవితాన్ని కొనసాగించారని అన్నారు. రచనలు, పాటలు ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఉపాధ్యాయులపై ఎన్‌ఆర్ రాసిన పాటను భార్య హేమలత చక్కటి గానం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్పు కళామండలి ప్రతినిధి రత్నం, న్యాయవారి శైలజ తదితరులు పాల్గొన్నారు.