తప్పు ఎన్‌టీఏది.. శిక్ష విద్యార్థులకా?
- జీసీఱ పునఃపరీక్షలపై రాహుల్ గాంధీ ఫైర్
- విద్యార్థుల సమయం, డబ్బు వృథా
- మానసిక ఒత్తిడికి బాధ్యులెవరు?
- మోదీ సమాధానం చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం
- విద్యార్థుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 17: జీసీ- ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మరోసారి పరీక్ష నిర్వహించాలన్న జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. పరీక్షలకు నెలల తరబడి సిద్ధమై, ఇప్పటికే పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థులు.. ఎన్‌టీఏ వైఫల్యాల కారణంగా మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి రావడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మోదీజీ.. మీ ఎన్‌టీఏ ఏం చేసిందో చూడండి.
జూన్ 22 నుంచి 30 వరకు సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ జీసీ-నెట్ పరీక్షలు జరిగాయి. దాదాపు రెండు నెలల తర్వాత ప్రశ్నపత్రాల్లో లోపాలు, గత ప్రశ్నల పునరావృతం కారణంగా ఈ మూడు పరీక్షలను ఎన్‌టీఏ రద్దు చేసింది. ఎన్‌టీఏ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి పరీక్షకు సిద్ధమైన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్‌టీఏ.. కానీ, శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులా?’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోపిడీ యంత్రంగా పరీక్షల వ్యవస్థ!
పరీక్షల వ్యవస్థను విద్యార్థులను దోపిడీ చేసే యంత్రంగా మార్చారని రాహుల్ ఆరోపించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు దేశంలో సరైన వ్యవస్థ లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తాను కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లలో ప్రస్తావించానన్నారు. ‘ఇది విద్యావ్యవస్థ కాదు.. డబ్బు, కాలం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుని చివరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యవస్థగా మారింది’ అని విమర్శించారు. జీసీ-నెట్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు ఎన్‌టీఏ ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు.
పరీక్షలు సరిగా నిర్వహించలేని వ్యవస్థ ఎందుకు?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి అడుగు మాత్రమేనని, ఎన్‌టీఏ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష రాయనున్న ప్రతి విద్యార్థికి చెబుతున్నా. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేని వ్యవస్థను నిర్మించిందని విమర్శించారు. ఆ వ్యవస్థ చేసిన తప్పులకు విద్యార్థులనే బాధ్యులుగా చేస్తోంది. మీ విలువైన సంవత్సరాలు వృథా అవుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.






