జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్‌టీఆర్
ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నగేష్ ముదిరాజ్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో యువ ఆరట్స్ థియేటర్ ఆధ్వర్యంలో గురువారం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ మధుసుదనా చారి, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట సేవారత్న, నంది అవారడ్స్ ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక ఉన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని, ఈ ఘనత ఆయనకే దక్కిందని వారు కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన భరతనాట్య నృత్యాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువ ఆరట్స్ థియేటర్ నిర్వాహకులు విద్యార్థినీల ప్రతిభను గుర్తించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు.






