మహానాడులో ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి
29-05-2026 12:00 AM
ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న కొత్తపల్లి రామాంజనేయులు
చర్ల: మే 28 (విజయక్రాంతి): నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని మండపేటలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడులో చర్ల రైతు క్లబ్ చైర్మన్, టీడీపీ జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు జోగేశ్వరరావు తో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వకారణమైన ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు






