19-01-2026 12:00:00 AM
వాడవాడలా ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
సికింద్రాబాద్/జవహర్‌నగర్/కుషాయిగూడ/జూబ్లీహిల్స్, జనవరి 18 (విజయ క్రాంతి): స్వర్గీయ ఎన్టీఆర్. కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకూ అజరామరంగా నిల్చి ఉంటుందని, సికింద్రాబాద్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగు ట్టలోని సి సెక్షన్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద వారి స్మృతికి, ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు వల్లారపు శ్రీనివాస్ కుమార్, తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీతాఫలమండీ డివిజన్ అధ్యక్షుడు జి.వి కృష్ణ, సీనియర్ నాయకుడు చందర్ ముదిరాజ్, పరిటాల విజయ్ కుమార్, శశిరేఖ, రామా దేవి, పుప్పాల విజయ్, మురళి, వెంకటస్వామి, సత్యం, నర్సిమ్మ, నటరాజ్, సిద్దులు, రవి, బాలయ్య, రుక్కుమ్ బాయి , సుభద్ర, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్‌లో..
జవహర్‌నగర్, జనవరి 18 (విజయక్రాంతి) : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30 వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో గల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ అధ్యక్షుడు లింగాల సూరిబాబు, కర్రి వెంకట రమణ, స్వామి యాదవ్.శ్రీరాములు, సంజయ్, రాజు, మెడ స్వామి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్
కుషాయిగూడ, జనవరి 18 (విజయక్రాంతి) : తెలుగుజాతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు ఆదివారం హౌసింగ్ బోర్డ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ డివిజన్ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి.
టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు భోదాసు లక్ష్మీనారాయణ. కాప్రా సర్కిల్ కాకతీయ సేవా సమితి నేతలు పెద్ద వీరభద్రరావు సిహెచ్ వి సాంబశివరావు గడ్డిపాటి సాయి మేక ప్రసాద్ తెలుగు మహిళ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సావిత్రి కాసం మైపాల్ రెడ్డి రామ్ ప్రదీప్ రాంబాబు కృష్ణమూర్తి నిసార్ వంజరి ప్రవీణ్ కలిపే తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నాయకుడు ఎన్టీఆర్
జూబ్లీహిల్స్, జనవరి 18 (విజయక్రాంతి) : ప్రజా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం మోతినగర్ లో జరిగింది.ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. మోతినగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు,స్థానికులు తదితరులున్నారు.