నర్సులు అంకితభావంతో పని చేసినప్పుడే గుర్తింపు
లయన్స్ క్లబ్ అధ్యక్షులు పోలవరపు సంతోష్. పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు..
తుంగతుర్తి ఏప్రిల్ 12: దవాఖానాలో నర్సులు అంకితభావంతో పనిచేసినప్పుడు గుర్తింపు లభిస్తుందని, వారు చేస్తున్న సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్ పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ నర్సులు సింగం సునీత, నాగలక్ష్మి, అనిత, కవిత ,శారద లను శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తల్లి ఒక బిడ్డను ఏ విధంగా సంరక్షించుకుంటుందో అదేవిధంగా దవాఖానకు వెళ్ళిన రోగులకు నర్సులు సేవలు అందిస్తారన్నారు. ప్రతి నర్సు రోగుల పట్ల అంకితభావంతో పనిచేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, తుంగతుర్తి లైయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, కోశాధికారి గుండ గాని రాము కోఆర్డినేటర్లు ఓరుగంటి శ్రీనివాస్ ఎనగందల గిరి, గుడిపూడి లక్ష్మణరావు, పులుసు వెంకటనారాయణ గౌడ్, గుజ్జా భాస్కర్, వాసం అభిలాష్, ఆరోగ్య సిబ్బంది సతీష్, తదితరులు పాల్గొన్నారు.






