calender_icon.png 23 January, 2026 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో కలిసి భోజనం.. సమస్యలపై ఆరా..

26-09-2024 04:27:47 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పోషన్ చర్చ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచిన మేరకు పలువురు అధికారులు పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేస్తూ సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని బాలుర ఆశ్రమ పాఠశాలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు.  పాఠశాలలోని రిజిస్టర్లను, రికార్డులను, వంటగదిని, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అరా తీసారు.

అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ మేరకు నూతన డైనింగ్ హాల్ నిర్మాణం, ఫర్నిచర్  ఏర్పాటు చేయాలని టీచర్స్, విద్యార్థులు అధికారికి సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేపట్టి, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో పాఠశాలలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్ కు విన్నవించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.