2 July, 2026 | 4:17 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి

26-09-2024 04:36 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

కామారెడ్డి,(విజయక్రాంతి): క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఏటిసంగం గ్రామంలో మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు అంతకుముందు విద్యార్థుల మార్చు పాస్ట్ ను తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు తాడువాయి మండలం ఎర్రపాడు  ఉన్నత పాఠశాలలో చదువుకున్నప్పుడు అప్పటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తాడూరి బాలా గౌడ్ క్రీడలను ప్రారంభించారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై క్రీడలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడల్లో పాల్గొనాలని గెలుపు ఓటమిలను వద్దని నైపుణ్యతను పెంచుకోవాలని సూచించారు. క్రీడల వల్ల మన లో ఉన్న ప్రతిభ బయటపడుతుందని అన్నారు.

క్రీడల వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని శరీరం ఆరోగ్యంగా దృఢంగా తయారవుతుందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగిన వారిని గుర్తు చేశారు. క్రీడాకారు లు గెలుపు ఓటములు సమానంగా భావించాలని సూచించారు. గాంధారి మండల కేంద్రంలో ఈడ మైదానం మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలోని క్రీడాకారులకు క్రీడల్లో రాణించే విద్యార్థులకు తన పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నుంచి గాంధారి మండల విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ సర్దార్ నాయక్ తూర్పు రాజులు ముకుందరావు గాంధారి జెడ్పి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రంగ వెంకటేశ్వర్ గౌడ్ పీడీ లక్ష్మణ్ రాథోడ్ ఉపాధ్యాయులు లింగం కాంగ్రెస్ నాయకులు పేట్ సంఘం గ్రామస్తులు పాల్గొన్నారు.