23 April, 2026 | 2:51 AM

పసిపిల్లలకు పౌష్టిక ఆహారం సక్రమంగా అందించాలి

23-04-2026 01:11 AM
  1. వెల్లుట్ల పేట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన
  2. సర్పంచ్ కొయ్యల వినోద, పంచాయతీ కార్యదర్శి శ్రీజ

ఎల్లారెడ్డి ఏప్రిల్ 22 (విజయ క్రాంతి) : పసిపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడి టీచర్ నిర్లక్ష్యం వాయించారాదని విద్యార్థులకు వేసవికాలం ఉన్నందున పసిపిల్లలను ప్రత్యేక శ్రద్ధతో చూడాలని, ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల పేట గ్రామ సర్పంచ్, కొయ్యల వినోద రాజా గౌడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీజ తెలిపారు. పసిపిల్లలకు భోజనంలో పౌష్టిక ఆహారంలో గర్భిణీలకు భోజన వసతిలో ఎటువంటి లోటు పాట్లు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అంగన్వాడి సెంటర్ సమయపాలన పాటించాలని పంచాయతీ కార్యదర్శి శ్రీజ అంగన్వాడి కార్యకర్తకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు పలువురు తదితరులు పాల్గొన్నారు.