23 April, 2026 | 2:51 AM

కేపీఆర్‌ఐటీలో సస్టైనబిలిటీ అవేర్నెస్ ప్రోగ్రాం

23-04-2026 01:10 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎర్త్ డే  సందర్భంగా బుధవారం సస్టైనబిలిటీ అవేర్నెస్ సెషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ భారత్ సస్టైనబుల్ క్యాంపస్ మిషన్ 2026లో భాగంగా జరిగింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ సహకారంతో నిర్వహించబడింది. ఇందులో ముఖ్య అతిథిగా జేఎన్టీయూహెచ్ మాజీ డైరెక్టర్ ప్రొఫ్. బి. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అలాగే డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ్ కాశ్యప్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈసెషన్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై నిర్వహించబడింది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, వ్యర్థ నిర్వహణ, పచ్చని ఆచరణలు, వాతావరణ బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించబడింది. విద్యార్థులు, అధ్యాపకులు చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కె. వంశీ కృష్ణ, హెచ్‌ఓడి  సిఎస్‌ఇ అండ్ ఐఐసి కన్వీనర్, రఘురామ్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కో- ఆర్డినేటర్ సమన్వయం చేశారు.