calender_icon.png 29 August, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గ్రంథాలయ చైర్మన్ ప్రమాణస్వీకారం

10-10-2024 12:15:33 AM

బాధ్యతలు స్వీకరించిన మల్లు నరసింహారెడ్డి 

మహబూబ్‌నగర్, అక్టోబర్ 10 ( విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథా లయ చైర్మన్‌గా బుధవారం మల్లు నరసింహారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మె ల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, అనిరుధ్‌రెడ్డిల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. మల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, ప్రజా సంక్షేమానికి కృషి చేసినందుకు తనకు సముచితస్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సహకరిం చిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ పాల్గొన్నారు.