calender_icon.png 13 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల ప్రమాణం

13-07-2025 01:30:14 AM

కాప్రా, జులై 12  :  కుషాయిగూడలోని  శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ దేవాదాయ ధర్మాదాయ ట్రస్టీ బోర్డు ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవానికి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో వీరేశం, ఇన్స్పెక్టర్ ప్రణీత్ సమక్షంలో ధర్మకర్తలుగా సింగిరెడ్డి వెంకటరెడ్డి, తాళ్లపల్లి మేఘరాజు, మైలారపు సదానందం, నల్లచెరువుల రాకేష్, కేసిరెడ్డి సుజీత్ రెడ్డి, ఇందూరి రమాదేవి, సార వినోద్ కుమార్, మూర మోహన్ రెడ్డి, గద్దల క్రాంతి కుమార్, మైలారం బాల నరసింహ, సింగిరెడ్డి బలవంత్ రెడ్డి, శ్రీ వెంకటరమణ చార్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఇది ఆలయ ట్రస్టీ బోర్డు ప్రథమ కమిటీ కావడం విశేషం. కార్యక్రమంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజి రెడ్డి, సీతారామ రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ అధ్యక్షులు కాశెట్టి ప్రసాద్, గడ్డం యాదగిరి, పోచయ్య, పెద్ది నాగరాజు, పెద్ది శీను,  నాగ శేషు, అజీజ్, భూపాల్ రెడ్డి, కే నాగరాజు, సుంకు శ్రీకాంత్ రెడ్డి, లింగం, మల్ రెడ్డి, బాబురావు, పూర్ణ యాదవ్, రాకేష్ యాదవ్, సత్యనారాయణ, సర్ఫరాజ్, వంశీ, నరేందర్ గౌడ్, సంతోష్ చారి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.