calender_icon.png 13 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గురుకులాల్లో సీట్ల సంఖ్య పెంచాలి

13-07-2025 01:32:12 AM

ఆలిండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్

ముషీరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచాలని  ఆలిండియా ట్రైబ ల్ జేఏసీ చైర్మన్ రవీందర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆలిండియా ట్రైబల్ జేఏసీ అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  రవీందర్ నాయక్ మాట్లాడుతూ  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం గు రుకుల విద్యా సంస్థల్లో, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించిన వసతులు, పెంచిన మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు తదితర కారణాల వల్ల ఈ విద్యా సంవత్సరం విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు సీట్ల సంఖ్యకు మించి దాదాపు 50 శాతం అదనంగా దరఖాస్తు చేసుకోవడం వల్ల మెరిట్ కలిగిన విద్యార్థులకు కూడా సీటు రాని పరిస్థితి ఉందని తెలిపారు. నిరుపేద గిరిజన ప్రజలు వారి పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థలలో చదివించుకోలేని పరిస్థితుల్లో విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి గిరిజన ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తక్షణమే గిరిజన గురుకుల పాఠశాలలో, ఏకలవ్య మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో సీట్లు పెంచాలని కోరారు. కో-ఆర్డినేటర్ గోపి నాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సభ్యులు శ్రీనివాసులు, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.