calender_icon.png 13 July, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌టీపీసీ ఇండియా తెలంగాణ మీడియా డైరెక్టర్‌గా చంద్రశేఖర్

13-07-2025 01:28:49 AM

ముషీరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): భారతీయ చలన చిత్ర పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ వేదికలపై అనేక సాంకేతిక , వ్యాపారాత్మక సదస్సులను ఏర్పాటు చేస్తూ సినీ పరిశ్రమ మేధోసంపత్తికి వారధిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండి యా తెలంగాణ శాఖ మీడియా డైరెక్టర్ గా జర్నలిస్ట్ గాజుల  చంద్రశేఖర్ ని నియమించారు. సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా , కార్యదర్శి విజయ్ వర్మలు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో  నియామక పత్రం అంద జేశారు.

బాలీవుడ్ నటి పూజా గంగూలీ, విలక్షణ నటులు శుభోదయం సుబ్బారావు లు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం లో బాలీవుడ్ సింగర్ అస్మిత, తెలంగాణ మీడియా చైర్మన్ కిరణ్ బేజాడి , నటీమణులు రోజాభారతి, కవిత లు పాల్గొన్నారు. అధ్యక్షులు చైతన్య జంగా, కార్యదర్శి విజయ్ శర్మ  మాట్లాడుతూ అంతర్జాతీయ సాంకేతికను అందిపుచ్చుకోవటం ఇతర రాష్ట్రాల , దేశాల వారు తెలంగాణ లో చిత్రీకరణ జరుపుకొనేలా ప్రోత్సహించడానికి ఎఫ్‌టీపీసీ కృషి జరుపుతోందని అన్నారు.

మీడియా డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ స్థానిక కళాకారులు సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష కార్యదర్సులకు కిరణ్ బేజాడి ధన్యవాదాలు తెలియచేసారు. తెలంగాణలో వున్న అద్భుతమైన లొకేషన్స్ కి బాలీవుడ్ లో ప్రాచుర్యం కల్పిస్తానని నటి పూజా గంగూలీ తెలిపారు. పలు కార్యక్రమాలతో చలన చిత్ర అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎఫ్‌టీపీసీ ని విలక్షణ నటులు శుభోదయం సుబ్బారావు అభినందించారు.