2 May, 2026 | 5:21 AM

అనర్థాలకు మూలం స్థూలకాయం

08-02-2025 12:07 AM

ప్రపంచాన్ని చుట్టుముడుతున్న పలు అనారోగ్య సమస్యల్లో స్థూలకాయం (అధిక బరువు) ముందువరుసలో వచ్చి చేరింది. ఈ సమస్యకు ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు అని గ్రహించాలి.. అమెరికాకు ప్రధాన శత్రువు ఒబేసిటీ అని మన అందరికీ తెలిసిందే. తరువాతి స్థానం లో చైనా నిలవగా, మనదేశం ఒబెసిటీలో మూడవ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది..

దేశంలో పౌష్టికాహారం లేక అనేకమంది పేద, మధ్య తరగతి ప్రజలు, పిల్లలు బాధపడుతుంటే, మరికొందరు పోషకాహారం ఎక్కువై ఈ ఒబేసిటీతో బాధపడు తున్నారు. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30.0 ఉంటే స్థూలకాయుడుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం మన దేశంలో  ఎనిమిది శాతం జనాభా అంటే సుమారు 10 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు.

సుమారు 1.40 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో సతమతమవుతున్నారు. అధిక బరువు తగ్గించుకోవడానికి గత ఏడాది వెయిట్ లాస్ సర్జరీలు 2 లక్షలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మనదేశంలో పిల్ల లు అధిక బరువుతో బాధపడుతున్నారు. దీ నికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవ డం, చదువు, ఇంటర్నెట్ లో ఎక్కువ సమ యం గడపడం వల్ల అధిక బరువు బారిన పడుతున్నారు.

దీనికి తోడు  చాక్లెట్స్, ఐస్‌క్రీమ్‌లు, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల అధిక సంఖ్యలో ఒబెసిటీ పెరుగుతోంది.  ఇక ప్రతీ వస్తువు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. 1990 నుంచి 2024 మధ్య కాలంలో ఒబెసిటీ బాధితుల సంఖ్య సుమా రు 4రెట్లు పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ ఆహారం, ఆయిల్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అధిక బరువుకు కారణం అని గ్రహించాలి. 

ఐ.ప్రసాదరావు