28 August, 2026 | 2:55 PM

ప్రధాని మోదీ, తల్లిదండ్రులపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్

28-08-2026 02:23 PM

పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు

కేసముద్రం, (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే స్వర్గస్థులైన ఆయన తల్లిదండ్రులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఫేస్‌బుక్‌లో కేసముద్రం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అత్యంత అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు పెట్టి, వారి ప్రతిష్టకు భంగం కలిగించారని,  సదరు వ్యక్తిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్  కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐ క్రాంతి కిరణ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఒక దేశ ప్రధాని దివంగత తల్లిని, ప్రధాని  పుట్టుకను అవమానిస్తూ, సమాజంలో అత్యంత అనాగరికంగా, అసభ్యకరమైన రీతిలో ఈ పోస్ట్ పెట్టడం జరిగిందని, ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, అత్యంత అసభ్యకరంగా ఒక మహిళా మూర్తి గౌరవాన్ని భంగపరచడమే అవుతుందన్నారు.

ఇలాంటి అభ్యంతరకర పోస్టుల వల్ల సమాజంలో గ్రూపుల మధ్య వైషమ్యాలు పెరిగి, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది," అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సదరు వ్యక్తి గతంలో కూడా 'ఆపరేషన్ సిందూర్'ను విమర్శిస్తూ, భారత సైన్యానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన చరిత్ర ఉందని, అతను నిరంతరం దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నాడని రమేష్ పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తిపై చట్ట ప్రకారం తక్షణమే కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహ రెడ్డి , మునిసిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి , ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పూర్నకంటి భాస్కర్ , బిజేవైయం , మండల అధ్యక్షుడు భుక్య విజయ్ , సీనియర్ నాయకులు భూక్య బాలు నాయక్, లెంకలపల్లి శ్రీనివాస్, వెలిశాల సవీణ్, బచ్చు లక్ష్మీనారాయణ, మహమ్మద్ ఖాసిం, ముదిరెడ్డి మురళీధర్ రెడ్డి, బానోత్ రాము, కొప్పుల వరుణ్, వేల్పుల ఐలయ్య, వల్లాల అనిల్, ఏబీవీపీ మండల కన్వీనర్ నునావత్ గణేష్, భూక్య సందీప్ , బానోత్ సురేందర్ భూక్య కోటి, లెంకల గణేష్ రెడ్డి,, బానోత్ రవి పాల్గొన్నారు .