15 June, 2026 | 1:55 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

వరి పంటల పరిశీలన

23-10-2025 01:54 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 22(విజయక్రాంతి): వరి రకము ఎంటియు 1001 లో సమస్యలు ఉన్నాయని కొంతమంది రైతులు స్థానిక మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు మేరకు బుధవారం మండల వ్యవసాయ అధికారి నవీన్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ శాస్త్రవేత్తలు కలిసి వెంకటాపురం మండలం బెస్త గూడెం, నూగూరు గ్రామాల్లో వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులు దగ్గర నుండి వారు వాడిన ఎరువులు, పురుగు మందులు మొదలైన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

దీనిపై అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను త్వరలోనే అందిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో..మండల వ్యవసాయ అధికారి నవీన్,శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ విజయ్ భాస్కర్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ అండ్ హెడ్ .డాక్టర్ రాజకుమార్, డాక్టర్ సౌందర్య , కుమారస్వామి టీజీ సీడ్స్ ప్రొడక్షన్ మేనేజర్, ఏఈఓ శ్యాం కుమార్ రైతులు పాల్గొన్నారు.