08-09-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఇంకా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పలు వినాయక విగ్రహాలను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
చెరువు కట్ట వద్ద నిమజ్జనం ఏర్పాట్లను ఆర్డిఓ పార్థసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఎస్త్స్ర బొజ్జ మహేష్ లు పర్యవేక్షించారు. కాగా వినాయక మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన శోభాయాత్రలో యువకులు బ్యాండ్ నృత్యాల మధ్య డాన్సులు చేస్తూ.. గణపతి బొప్పా మోరియా అంటూ&ఉత్సాహంగా శోభ యాత్రలో పాల్గొన్నారు.