జూబ్లీ గార్డెన్స్ కాలనీలో నాలా అవుట్లెట్ సమస్యపై పరిశీలన
- డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం మా ప్రధాన లక్ష్యం
- ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూన్ 14 (విజయక్రాంతి): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వరద నీరు, ముంపు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఆరికెపూడి గాంధీ అన్నారు. ఆదివారం మాదాపూర్ డివిజన్లోని జూబ్లీ గార్డెన్స్ కాలనీలో నెలకొన్న నాలా అవుట్లెట్ సమస్యను జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
గాంధీ మాట్లాడుతూ..వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం మా ప్రధాన లక్ష్యం అని,జూబ్లీ గార్డెన్స్ కాలనీలోని నాలా అవుట్లెట్ వద్ద ఉన్న సమస్యను గుర్తించి,తక్షణం పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ పర్యటనలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






