calender_icon.png 11 July, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల ముందే క్షుద్ర పూజల కలకలం

11-07-2025 08:23:37 AM

పలుకూడల్లో రోజురోజుకు పెరిగిపోతున్న పూజలు.. భయం లో ప్రజలు

తుంగతుర్తి(విజయక్రాంతి): సమాజంలో రోజురోజుకు సాంకేతికపరమైన టెక్నాలజీలో ముందుండి, భయంకరమైన వ్యాధులను కూడా పరిష్కారం జరుగుతున్న తరుణంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణ(Thungathurthy town) కేంద్రంలో కొంతమంది తమకు వ్యాధులు శోకాయని, ఇతరులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నంలో వంతుగా పూజల తంత్రం నిర్వహించి, పసుపు కుంకుమలు పలు వీధులు కలిసే చోట చల్లి, నిమ్మకాయలు పెట్టి, కొబ్బరికాయలు పెట్టి, రాత్రికి రాత్రి జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా నిర్వహించి, ఉదయాన్నే చూడగానే గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జోరుగా జరిగాయి ప్రస్తుతం. జరుగుతున్న సంఘటన పట్ల పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి, క్షుద్ర పూజను ప్రోత్సహిస్తున్న వారిపై, క్రిమినల్ కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన కేవలం పోలీస్ స్టేషన్కు కూత వంటి దూరంలో ఉండడం గమనార్వం.