calender_icon.png 11 July, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధిస్తున్నాడు.. న్యాయం చేయండి !

11-07-2025 11:28:05 AM

  1. పూజారిపై మహిళా కమిషన్ కి ఎస్టీ మహిళా ఫిర్యాదు
  2. ముదురుతున్న పూజారి వివాదం

బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బుగ్గ దేవాలయం పూజారి రాంబట్ల వేణుగోపాల శర్మ వ్యవహారం రోజు రోజుకీ ముదిరిపోతోన్నది. తనను వేధిస్తున్నాడంటూ బాధితురాలు గుండ భీమక్క ఇప్పటికే పూజారిపై రాష్ట్ర దేవదాయ శాఖ కమిషన్(State Endowment Commission)కి  ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఆమె మహిళా కమిషన్  కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో పూజారి వివాదం మరింత రచ్చ రచ్చ అవుతున్నది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో దీర్ఘకాలంగా ఇక్కడే పూజారిగా రాంబట్ల వేణుగోపాల శర్మ పనిచేస్తున్నారు. కాసిపేట మండలం బుగ్గ గూడెం గ్రామానికి చెందిన గుండ భీమక్క బుగ్గదేవాలయంలో కొంతకాలo నుంచి కొబ్బరికాయలు విక్రయిస్తున్నారు. తనపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, గుడి ప్రాంతానికి రావద్దనీ మరీ బెదిరింపులకు పాల్పడుతున్నాడని భీమక్క ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా బుగ్గ దేవాలయానికి మొక్కలు చెల్లించుకోవడానికి వచ్చే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అర్చకుని వ్యవహారాన్ని భీమక్క వెలుగులోకి  తీసుకొచ్చారు. తన భర్త గణపతితో కలిసి భీమక్క దేవదాయశాఖ కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా మహిళా కమిషన్ కూడా ఆమె సంప్రదించారు. దీంతో పూజారి వేణుగోపాల్ శర్మ వ్యవహారం రోజురోజుకీ వివాదాస్పదంగా మారు మారుతోంది. గతంలో కూడా బుగ్గ పూజారి వేణుగోపాల్ పై పలు అనైతికమైన ఆరోపణలు వచ్చాయి. వెరసి పూజారి వేణుగోపాల శర్మను ఇటీవలనే విధుల నుంచి ఎండోమెంట్ అధికారులు సస్పెండ్ కూడా చేశారు.

నయానో బయానో సదరు పూజారి వేణుగోపాల శర్మ తన సస్పెండ్ ను రద్దు చేపించుకొని అనతి కాలంలోనే మళ్లీ పూజారీగా వీధుల్లో చేరారు. ఈ క్రమంలోనే భీమక్కపై పూజారి వేధింపులు, దేవదాయశాఖ, మహిళా కమిషన్ల దృష్టికి వెళ్లడం బెల్లంపల్లిలో హాట్ టాపిక్ గా మారింది. బెల్లంపల్లిలో పూజారి వ్యవహారం ఆద్యంతం చర్చనీయాoశంగామారింది. పూజారి వేణుగోపాల శర్మ నుంచి కాపాడాలని ఆమె మహిళా కమిషన్ వేడుకుంది. అంతేకాకుండా తనకు ప్రాణహాని ఉందని కూడా మొరపెట్టుకుంది. ఈ విషయంలో అటు దేవాదాయశాఖ, ఇటు మహిళా కమిషన్ జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని, పూజారి వేధింపుల నుంచి కాపాడాలని బాధితురాలు భీమక్క మహిళా కమిషన్ కి మొరపెట్టుకుంది. పూజారిపై ఫిర్యాదు చేసిన మహిళా ఉదంతం పై దేవాదాయ శాఖ, మహిళ కమిషన్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలిమరి.