19 May, 2026 | 4:17 AM

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ఓడీ సదుపాయం

19-05-2026 12:27 AM

9 సంఘాలకు ఇస్తూ ఉత్తర్వులు 

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఓడీ (అదర్ డ్యూటీ) సదుపాయాన్ని కల్పించింది. ఈమేరకు సోమవారం జీవోను విడుదల చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నేతృత్వం వహించే అధ్యక్ష, ప్రధానకార్యదర్శులకు ఓడీ సదుపాయాన్ని కల్పించింది.

ఓడీ సదుపాయం కల్పించిన వారిలో టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, ట్రెసా, తెలంగాణ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్, టీఎస్ యూటీఎఫ్, టీఆర్టీఎఫ్, తెలంగాణ సెక్రటేరియేట్ అసోసియేషన్ సంఘాలున్నాయి. ఆయా సంఘాల్లోని లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చర్చించి, పరిష్కారం దిశగా చొరవ చూపేందుకు గానూ వీరికి ఓడీ అవకాశం కల్పిస్తారు. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది పాటు అమలులో ఉంటాయి.