లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు
13-06-2024 02:02 AM
గద్వాల (వనపర్తి ), జూన్ 12 (విజయక్రాంతి): జిల్లాలోని ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో బుధవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ టీజీఎస్పీ బీచుపల్లి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామి, రిటైర్డ్ ఏఆర్ ఎస్సై అబ్దుల్ వహాబ్ పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిసారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఏఆర్ ఎస్సై అబ్దుల్ వహాబ్ సహకారంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ యొక్క మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నడు. విశ్వసనీయ సమాచారం రావడంతో బుధవారం తన బృందంతో కలిసి దాడులు నిర్వహించి ఇద్దరినీ పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గురువారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు వెల్లడించారు.






