రాధక్కకు న్యూడెమోక్రసీ నేతల నివాళి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (విజయక్రాంతి) : ప్రతిఘటనోద్యమ సాయుధ విప్లవ నాయకురాలు, దివంగత చండ్ర పుల్లారెడ్డి జీవిత సహచరి రాధక్కకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుధవారం సింగరేణి కాలనీలోని రాధక్క కుమార్తె నివాసం వద్ద ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. సీపీఐ (ఎంఎల్) జాతీయ కార్యదర్శి శేఖర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్, గోపి, జాతీయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర రావు, రాష్ట్ర నాయకులు రణధీర్, కె. గోవర్థన్, సంధ్య, గోపి, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి విజయ్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఆరెళ్లి కృష్ణ, నున్నా అప్పారావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సరళ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం. వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాంబ తదితరులు పాల్గొన్నారు.






