15-05-2025 12:00:00 AM
ఆదిలాబాద్, మే 14 (విజయక్రాంతి): సర్వసాధారణంగా ప్రజాప్రతినిధులకు, నాయకుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడం ఎక్కడైన చూసాం, కానీ ఆదిలాబా ద్ జిల్లాలో మాత్రం అధికారుల ఫ్లెక్సీకి క్షీరా భిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు మేడిగూడ గ్రామస్తులు. సాత్నాల మండలంలోని పలు గ్రామాల రైతులు పం డించిన జొన్న పంటను అమ్ముకోవడానికి జైనథ్ మార్కెట్ యార్డ్‌కు వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు.
ఈ నేపథ్యంలో గ్రామంలోని జొన్నల కొనుగోలు ఏర్పాటు చేయాలని ఇటీవల కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులకు విన్నవించారు. దీంతో గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామల దేవి ఫ్లెక్సీలకు గ్రామస్తులు బుధవారం క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.