calender_icon.png 15 May, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

14-05-2025 11:29:30 PM

శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్..

గీత కార్మికులకు 100 కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ..

మహబూబాబాద్ (విజయక్రాంతి): అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కుల వృత్తులపై ఆధారపడ్డ వారికోసం ప్రత్యేకంగా పథకాలను అమలు చేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Bhukya Murali Naik) అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గీతా కార్మికుల సంక్షేమం కోసం పూర్తిస్థాయి సబ్సిడీతో అందించే కాటమయ్య రక్షణ కవచం కిట్స్ మహబూబాబాద్ పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబిసి, అగ్రవర్ణాల పేదల్లో ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గీతా కార్మికులు వృత్తిలో భాగంగా తాటి చెట్ల పై నుండి ప్రమాదవశాత్తు పడి చనిపోవడం, అంగవైకల్యం జరగడం తరచూ జరుగుతోందని, అలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో ఈ కాటమయ్య కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కిట్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, ఎక్సైజ్ సూపర్డెంట్ కిరణ్ కుమార్, ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, గీతా కార్మికులు సంబంధిత విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.