15-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 14(విజయక్రాంతి): అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందు కు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదే శించారు. జిల్లాలో ఆర్‌ఎఫ్‌ఆర్ (రైట్ఫుల్ ఫారెస్ట్ రూల్స్) అమలుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వ హించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పను లను చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాలలో రహదారులు, బ్రిడ్జిలు, విద్యు త్ తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు అటవీశాఖకు సరైన విధంగా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపించాల ని సూచించారు.
అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రతి శాఖ తమ ప్రపోజల్స్ అటవీశాఖ తో సమన్వయం చేసుకుని ముందుగా ఆమోదం పొందాలని, చేపట్టనున్న అభివృ ద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.అటవీశాఖ అవసరమైన మార్గదర్శకాలను సంబంధిత శాఖలకు త్వరితగతి న పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, సం బంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.