13 June, 2026 | 2:14 AM

చెట్టుకొమ్మల్లో కరెంటు తీగలు పట్టించుకోని అధికారులు

13-06-2026 01:12 AM

బెజ్జూర్, జూన్ 12 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎయిర్టెల్ టవర్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన చెట్టు కొమ్మల్లో కరెంటు తీగలు వేలాడుతున్నాయి. మండల కేంద్రంలోని పలుచోట్ల చెట్టుకొమ్మల్లో కరెంటు తీగలు వేలాడుతుండడంతో గాలివీచిన సమయంలో వర్షం కురిసిన సమయంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు.

చెట్టుకొమ్మల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు ప్రయాణికులు తెలిపినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తు న్నారు. మండల కేంద్రంలో విద్యుత్ లో ఓల్ ఏజ్ సమస్య   ఉండడంతో మోటర్లు పనిచేయక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలుపుతున్నారు. ఇట్టి విషయమై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్టుకొమ్మలను వెంటనే తొలగించి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.