14-01-2026 12:00:00 AM
నారాయణపేట, జనవరి 13 (విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగార్ బేస్, శ్రీనగర్ కాలనీ, శ్యాసన్ పల్లి రోడ్డులో ప్రజల విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖామంత్రి భట్టి విక్రమార్క ఆదేశానుసారం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా, ఓల్టేజి తదితర సమస్యలను ఆడిగి తెలుసుకొన్నారు. అదేవిదంగా సరస్వతి నగర్‌లో సుమారు 130 ఇళ్లు ఉన్నా విద్యుత్ సదుపాయాలు లేక ఇబ్బందులను ఎదుకొంటున్నామని, కాలనీలోని అన్ని వీదులకు 45 విద్యుత్ స్తంభాలు అవసరమున్నాయని అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ఏవైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే అక్కడికక్కడే పరిష్కరించే దిశలో ప్రజాబాట కార్యక్రమాని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎస్‌ఈ నవీన్ కుమార్, డిఈ నర్సింగరావు, ఏఈ మహేష్ కుమార్ గౌడ్ లైన్ మెన్లు, జిల్లా విద్యుత్ కాంట్రాక్టు అసోసియేషన్ అధ్యక్షుడు పోలేమోని కృష్ణ కాలనీ వాసులు లక్ష్మీ కాంత్, వెంకట్రామరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.