13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సమస్యలు పరిష్కారించాలని అధికారులకు ఆదేశం

20-01-2026 12:00 AM

ఆలేరు, జనవరి 19 (విజయక్రాంతి): భువనగిరి కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే  పరిష్కరించాలని స్థానిక సంస్థల(రెవెన్యూ) అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు, సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కర్ రావు వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 29 అర్జీలను స్వీకరించారు, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అందులో రెవిన్యూ శాఖ 20, పంచాయతీ శాఖ 3, గ్రామీణాభివృద్ధి శాఖ 2, ఎస్సీ వెల్ఫేర్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపాలిటీ, లేబర్  శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు, వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ జయమ్మ, ఆర్డీవో కృష్ణారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.