20-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 19 (విజయ క్రాంతి):ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయ్యారం గరల్స్ హై స్కూల్ కు కంప్యూటర్ బహుకరించారు. ప్రథం సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ స్రవంతి మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిం చి అందులో ప్రతిభ చాటిన పాఠశాలల వి ద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సంస్థ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు.
ఇందులో భాగంగా బయ్యారం గరల్స్ హై స్కూల్ ఎంపికైనందున, పిల్లలకు అవస రం గుర్తించి అందజేసినట్లు చెప్పారు. హెడ్మాస్టర్ లక్ష్మణరావు, స్రవంతి, మల్లయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.