అభివృద్ధి పనులపై అధికారుల పర్యటన
31-07-2026 12:00 AM
ప్రభుత్వ పాఠశాల, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్ పనుల పరిశీలన
నాగోల్, జూలై 30 (విజయ క్రాంతి) మహేశ్వరం నియోజకవర్గంలోని డాక్టర్స్ కాలనీ డివిజన్ భగత్సింగ్ నగర్లో ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, కమ్యూనిటీ హాల్, మినీ ఫంక్షనల్ షెడ్, నవజ్యోతి మహిళా భవన్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ వికాస్, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఏఈ విజయ్, ఈఈ కార్తీక్ పాల్గొన్నారు. వారితో పాటు డాక్టర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్, జనరల్ సెక్రటరీ ఇమ్రాన్ అలీ, జనార్ధన్ గౌడ్, ఆసిఫ్, పాషా తదితరులు పాల్గొన్నారు.






