జమాయత్ ఉల్ ఖురేషీ కమిటీ అధ్యక్షుడిగా ఉమర్ హుస్సేన్
31-07-2026 12:00 AM
ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): జమాయత్ ఉల్ ఖురేషీ సికింద్రాబాద్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మహ్మద్ ఉమర్ హుస్సేన్ నియమితులయ్యారు. ఆయన నియామకం పట్ల వివిధ పార్టీల నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేస్తూ ముషీరాబాద్ లో సన్మానించారు.
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అక్లక్ హుస్సేన్, ఎంఐఎం పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి మహ్మద్ యామిన్ ఖాన్ తదితరులు ఉమర్ హుస్సేన్ ను సన్మానించి మాట్లాడారు. నూతన కమిటీ కార్యవర్గం సామాజిక బాధ్యతతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాహెర్ హుస్సేన్, ఇఫ్రాన్ హుస్సేన్, గౌస్, మహ్మద్ రఫిక్ పాషా, జాకీర్ హుస్సేన్, జాంగీర్ తదితరులు పాల్గొన్నారు.






